నయా నిజాంకు వ్యతిరేకంగా పోరాడాలి

దిశ, తెలంగాణ బ్యూరో : చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నయా నిజాం సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గోలి హరికృష్ణ, ఏఐటీయూసీ కోశాధికారి బొడ్డుపల్లి కిషన్ అన్నారు. హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో శుక్రవారం చాకలి ఐలమ్మ 36వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దొరల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ విగ్రహాన్ని […]

Update: 2021-09-10 05:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : చాకలి ఐలమ్మ స్ఫూర్తితో నయా నిజాం సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడాలని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గోలి హరికృష్ణ, ఏఐటీయూసీ కోశాధికారి బొడ్డుపల్లి కిషన్ అన్నారు. హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో శుక్రవారం చాకలి ఐలమ్మ 36వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దొరల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి ఐలమ్మ అని కొనియాడారు. ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించాలని వారు డిమాండ్ చేశారు. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులకు ఉచిత నాణ్యమైనవిద్య, వైద్యం, ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయాలని, ప్రభుత్వ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చీమల శంకర్, సందీప్, నవీన్, సతీష్, రాములు, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News