రాంగోపాల్ వర్మకు షాకిచ్చిన కోర్టు

దిశ ప్రతినిధి, నల్లగొండ: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ అమృత ప్రేమజంట వ్యవహారంపై మర్డర్ పేరుతో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ కుటుంబాన్ని సంప్రదించకుండా సినిమా నిర్మి౦చడంతో ప్రణయ్ తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు. తమ కులాన్ని కించపరిచేలా వర్మ సినిమా రూపొందిస్తున్నారని బాలస్వామి పిటీషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు […]

Update: 2020-08-24 03:56 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ అమృత ప్రేమజంట వ్యవహారంపై మర్డర్ పేరుతో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ కుటుంబాన్ని సంప్రదించకుండా సినిమా నిర్మి౦చడంతో ప్రణయ్ తండ్రి బాలస్వామి కోర్టును ఆశ్రయించారు. తమ కులాన్ని కించపరిచేలా వర్మ సినిమా రూపొందిస్తున్నారని బాలస్వామి పిటీషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడుతూ వస్తోంది. కోర్టులో బాలస్వామి తరుపున వాదనలు పీపీ వాదనలు వినిపించారు. దీంతో మర్డర్ సినిమా విడుదల నిలిపివేయాలని నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News