ఇసుక తవ్వొద్దన్నందుకు లారీతో తొక్కించి..

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియా పెట్రేగిపోతోంది. తన పొలంలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఓ రైతును ఏకంగా లారీతో తొక్కించి హత్యచేశారు. ఈ ఘటన జిల్లాలోని రాజాపూర్ మండలం తీర్మాలపూర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన గుర్రం కాడి నర్శింములు( 38) అనే రైతు తన పొలం నుంచి ఇసుక అక్రమ రవాణా చేయొద్దని.. గత మూడేండ్లుగా వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని […]

Update: 2020-07-29 21:20 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ :
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇసుక మాఫియా పెట్రేగిపోతోంది. తన పొలంలో ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఓ రైతును ఏకంగా లారీతో తొక్కించి హత్యచేశారు. ఈ ఘటన జిల్లాలోని రాజాపూర్ మండలం తీర్మాలపూర్ గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన గుర్రం కాడి నర్శింములు( 38) అనే రైతు తన పొలం నుంచి ఇసుక అక్రమ రవాణా చేయొద్దని.. గత మూడేండ్లుగా వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని వారితో వారించాడు.ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇసుక తరలిస్తున్న లారీని రైతు నర్సింహులు అడ్డుకున్నారు.

దీంతో ఆగ్రహించిన డ్రైవర్ కావాలనే నర్సింహులు పై మీదకు లారీ ఎక్కించడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు లారీ డ్రైవర్ ను పట్టుకుని లారీని అద్దాలను ధ్వంసం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వల్లే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని.. రైతులు హత్యలు జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇసుక మాఫియా మూలంగా రోడ్డు ప్రమాదంలో అమాయక రైతుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి.

Tags:    

Similar News