జీవో 60ను అమలు పరచాలని మున్సిపల్ కార్మికుల ధర్నా

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో జీవో 60 అమలు పరచాలని మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించి కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్  అధ్యక్షులు కర్రెం కృష్ణ అధ్యక్షత వహించగా ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఫిట్ మెంట్ అమలు కొరకు జీవో నెంబర్ 60ని జూన్‌ల్లో […]

Update: 2021-12-17 05:44 GMT

దిశ, మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్ టీయూ ఆధ్వర్యంలో జీవో 60 అమలు పరచాలని మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించి కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రగతి శీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కర్రెం కృష్ణ అధ్యక్షత వహించగా ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఫిట్ మెంట్ అమలు కొరకు జీవో నెంబర్ 60ని జూన్‌ల్లో విడుదల చేసిందని గుర్తు చేశారు. కాగా నేటికీ మక్తల్ మునిసిపాలిటిలో ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించారు.

కార్మికులు తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో పాలకులు మున్సిపల్ కార్మికులను సన్మానించడం శాలువాలు కప్పడం తో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. పీఆర్సీ అమలు కోసం కార్మికులు సంఘటితంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియూ జిల్లా అధ్యక్షుడు కిరణ్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఉపాధ్యక్షులు రాములు, శంషోద్దీన్, రామలింగప్ప, జె నర్సింహులు, బాలస్వామి, కె బాబు, అమ్మక్క, మహేశ్వరమ్మ, ఆశన్న, జె బాబు, జి మారుతి, చిన్న వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News