మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయాలి..

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ పేర్కొన్నారు. ఈరోజు గాంధీభవన్లో‌ నిరంజన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం పట్టించుకోండని హైకోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ కార్యకర్తలు, ప్రజలు, ఎన్నికల సిబ్బందిని ప్రమాదంలో పడేసినట్లే అని సూచించారు. […]

Update: 2021-04-20 07:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను వెంటనే నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ పేర్కొన్నారు. ఈరోజు గాంధీభవన్లో‌ నిరంజన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం పట్టించుకోండని హైకోర్టు ప్రశ్నించిన విషయాన్ని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయ కార్యకర్తలు, ప్రజలు, ఎన్నికల సిబ్బందిని ప్రమాదంలో పడేసినట్లే అని సూచించారు. సాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా హాలియా సభలో పాల్గొన్నందుకే సీఎం కేసీఆర్ కి కరోనా సోకిందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని ప్రజలు అక్కడి రావాలంటేనే జంకుతున్నారన్నారు. ఎన్నికల నిర్వహణ వల్ల.. ఎన్నికల సిబ్బంది, ఇతర సిబ్బంది కలిపి దాదాపు 12వేల మందిని ప్రమాదంలోకి నెట్టేసినట్టే అని తెలిపారు. ఈ క్రమంలో ఎన్నికలను నిర్వహించి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఎన్నికల కమిషనర్ ను కోరతామని ఆయన చెప్పారు.

 

Tags:    

Similar News