మళ్లీ మ్యాచ్ టై అయిందేంటి?
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 36వ మ్యాచ్ టై గా ముగిసింది. చివరి వరకు ఆసక్తి కరంగా సాగిన మ్యాచ్ ఎట్టకేలకు డ్రాగా ముగిసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ రోజు జరిగిన తొలి మ్యాచ్ కూడా టైగా ముగిసిన సంగతి తెలిసిందే. కానీ, సూపర్ ఓవర్లో కోల్‌కతా అనూహ్య విజయం సాధించింది. ఇక ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 36వ మ్యాచ్ టై గా ముగిసింది. చివరి వరకు ఆసక్తి కరంగా సాగిన మ్యాచ్ ఎట్టకేలకు డ్రాగా ముగిసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ రోజు జరిగిన తొలి మ్యాచ్ కూడా టైగా ముగిసిన సంగతి తెలిసిందే. కానీ, సూపర్ ఓవర్లో కోల్‌కతా అనూహ్య విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో విజయం ఎవరు సాధిస్తారో వేచిచూడాల్సిందే.
పంజాబ్ ఇన్నింగ్స్:
తొలుత ఓపెనింగ్ దిగిన కెప్టెన్ కేఎల్ రాహుల్ (77) పరుగులతో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, మయాంక్ అగర్వాల్ కేవలం 11 పరుగులకే బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చి క్రిస్ గేల్ (24) పరుగులు చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ సైతం (24) పరుగులే చేశాడు.
ఇదే సమయంలో వచ్చిన మ్యాక్స్‌వెల్ డకౌట్‌తో నిరాశ పరిచాడు. ఇక దీపక్ హుడా రాహుల్‌కు మంచి భాగస్వామ్యం కల్పిస్తూ వచ్చాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. కానీ, 18వ ఓవర్లో బుమ్రా వేసిన బంతిని డిఫెన్స్ చేసే సమయంలో క్లీన్ బోల్డ్ అయ్యాడు. దీంతో 153 పరుగుల వద్ద పంజాబ్ 5 కీలక వికెట్లను కోల్పోయింది.
ఇక క్రీజులో దీపక్ హుడాకు తోడుగా క్రిస్ జోర్డన్ వచ్చాడు. ఇదే సమయంలో 18 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 155/5గా ఉంది. చివరి 12 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉండగా.. 19వ ఓవర్ లో 13 పరుగులు వచ్చాయి. ఇక 20వ ఓవర్‌కు 9 పరుగులు చేయాల్సి ఉంది.
ఆసక్తికర చివరి ఓవర్
చివరి ఓవర్లో క్రీజులో ఉన్న దీపక్ హుడా.. ప్రత్యర్థి బౌలర్ ట్రెంట్ బోల్ట్‌తో మ్యాచ్ ఒక్కసారిగా ఆసక్తి కరంగా మారింది. తొలి బంతికి సింగల్ వచ్చినా.. రెండో బంతి మాత్రం ఫోర్ పోయింది. ఆ తర్వాత బంతి సింగిల్ రావడంతో 3 బంతుల్లో మూడు పరుగులకు స్కోరు బోర్డు రావడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠంగా మారింది. తర్వాతి బాల్ డాట్ కావడంతో ఐదో బాల్ సింగిల్ వచ్చింది. ఇక ఒక బంతికే రెండు పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చివరి బంతిని స్ట్రైక్ చేసిన జోర్డాన్.. రెండో బంతికి ప్రయత్నంలో వికెట్ అవుట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులే రావడంతో మ్యాచ్ టై గా ముగిసింది.
ముంబై ఇన్నింగ్స్:
ఐపీఎల్ 36వ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై తొలుత చతికిల పడ్డా.. ఆ తర్వాత మెరుపు ఇన్నింగ్స్ చేసింది. 38 పరుగులకే 3 వికెట్లను కోల్పోయిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత నలుగురి బ్యాట్స్మెన్ల మెరుపు ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది.
తొలుత ఓపెనింగ్ దిగిన రోహిత్ శర్మ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. 3వ ఓవర్లో అర్షదీప్ రోహిత్‌ను 23 పరుగుల వద్ద అవుట్ చేశాడు. డీకాక్ అప్పటికే క్రీజులో కుదురుకొని బ్యాటింగ్ కొనసాగించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్(0) షమి బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక మిడిలార్డర్లో వచ్చిన ఇషాన్ కిషన్ (7) పరుగులు మాత్రమే చేసి రవి భిష్నోయ్ బౌలింగ్‌లో మురుగన్ అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 38 పరుగులకే ముంబై మూడు వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాతి 5వ స్థానంలో వచ్చిన కృనాల్ పాండ్యా 34 పరుగులతో రాణించాడు. 4 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి డీకాక్‌కు మంచి భాగస్వామ్యం ఇచ్చాడు. కానీ, రవి భిష్నోయ్ బౌలింగ్‌లో షాట్‌కు ట్రై చేసి దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 6వ స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక అప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డీకాక్(53) భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 16.3 ఓవర్లలో 119 పరుగులకు ముంబై 6 వికెట్లు కోల్పోయింది.
ఇక 7,8 స్థానాల్లో వచ్చిన కీరన్ పొలార్డ్(34), కాల్టర్ నైల్(24) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. 21 బంతుల్లో ఇద్దరు కలిసి ఏకంగా 57 పరుగులు చేశారు. ముఖ్యంగా పొలార్డ్ 12 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సర్లతో 34 పరుగులు రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ముంబై 176 పరుగులు చేశారు.
స్కోరు బోర్డు:
Mumbai Indians Innings176-6 (20 Ov)
1. రోహిత్ శర్మ (c)b అర్ష్‌దీప్ సింగ్ 9(8)
2. క్వింటన్ డీకాక్ (wk) c మయాంక్ అగర్వాల్ b క్రిస్ జోర్డాన్ 53(43)
3. సూర్య కుమార్ యాదవ్ c మురుగన్ అశ్విన్ b షమి 0(4)
4. ఇషాన్ కిషన్ c మురుగన్ అశ్విన్ b అర్ష్‌దీప్ సింగ్ 7(7)
5. కృనాల్ పాండ్యా c దీపక్ హుడా b రవి భిష్నోయ్ 34(30)
6. హార్దిక్ పాండ్యా c నికోలస్ పూరన్ b షమి 8(4)
7. కీరన్ పొలార్డ్ నాటౌట్ 34(12)
8. కాల్టర్ నైల్ నాటౌట్ 24(12)
ఎక్స్‌ట్రాలు: 7
మొత్తం స్కోరు: 176-6
వికెట్ల పతనం: 23-1 (రోహిత్ శర్మ, 2.5), 24-2 (సూర్యకుమార్ యాదవ్, 3.3), 38-3 (ఇషాన్ కిషన్, 5.1), 96-4 (కృనాల్ పాండ్యా, 13.5), 116-5 (హార్దిక్ పాండ్యా, 15.3), 119-6 (క్వింటాన్ డీ కాక్, 16.3)
బౌలింగ్:
1. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4-0-24-0
2. మహ్మద్ షమి 4-0-30-2
3. అర్ష్‌దీప్ సింగ్ 3-0-35-2
4. క్రిస్ జోర్డాన్ 3-0-32-1
5. మురుగన్ అశ్విన్ 3-0-28-0
6. దీపక్ హుడా 1-0-9-0
7. రవి భిష్నోయ్ 2-0-12-1
Kings XI Punjab Innings:
1. కేఎల్ రాహుల్ b బుమ్రా 77(53)
2. మయాంక్ అగర్వాల్ b బుమ్రా 11(10)
3.క్రిస్ గేల్ c బోల్ట్ b రాహుల్ చాహర్ 24(21)
4.నికోలస్ పూరన్ c కల్టర్ నైల్ b బుమ్రా 24(12)
5.గ్లెన్ మ్యాక్స్‌వెల్ c రోహిత్ b రాహుల్ చాహర్ 0(2)
6.దీపక్ హుడా నాటౌట్ 23(16)
7.క్రిస్ జోర్డాన్ నాటౌట్ run out (పొలార్డ్ /డీకాక్ )13(8)
ఎక్స్‌ట్రాలు: 4
మొత్తం స్కోరు: 176
వికెట్ల పతనం: 33-1 (మయాంక్ అగర్వాల్, 3.3), 75-2 (క్రిస్ గేల్, 9.1), 108-3 (నికోలస్ పూరన్, 12.5), 115-4 (గ్లెన్ మ్యాక్స్‌వెల్, 13.3)153-5 (కేఎల్ రాహుల్ , 17.3), 176-6 (క్రిస్ జోర్డాన్, 20).
బౌలింగ్:
1. ట్రెంట్ బోల్ట్ 3-0-48-0
2. కృనాల్ పాండ్యా 2-0-12-0
3. జస్ప్రీత్ బుమ్రా 4-0-24-2
4. నాథన్ కల్టర్ నైల్ 4-0-33-0
5. కీరన్ పొలార్డ్ 2-0-26-0
6. రాహుల్ చాహర్ 4-0-33-2