చెలరేగిన డీ కాక్.. రాజస్థాన్‌పై ముంబై గెలుపు

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పొందిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది.అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 24వ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ (14) నిరాశ పరిచాడు. మరో ఓపెనర్ క్వింటన్ డీ […]

Update: 2021-04-29 08:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పొందిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తిరిగి పుంజుకుంది.అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 24వ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ (14) నిరాశ పరిచాడు. మరో ఓపెనర్ క్వింటన్ డీ కాక్ ( 70 నాటౌట్) ఆకట్టుకున్నాడు. 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. చివరి వరకు నిలబడి మ్యాచ్‌ విజయంలో కీలక ఇన్నింగ్ ఆడాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు సూర్యకుమార్ యాదవ్ (16) పరుగులకే పెవిలియన్ చేరినా.. మిడిలార్డర్ బ్యాట్స్‌మాన్ కృనాల్ పాండ్యా(39) మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఔట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత డీకాక్‌కు తోడుగా కీరన్ పొలార్డ్(16 నాటౌట్ ) తన వంతు కృషి చేశాడు.

Tags:    

Similar News