బైకుల్లా జైలులో కరోనా.. ఇంద్రాణి ముఖర్జియాకు పాజిటివ్

ముంబై: మహారాష్ట్రలోని బైకుల్లా జైలులో కరోనా కలకలం రేపింది. ఈ షీనా బోరా మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఐఎన్ఎక్స్ మీడియా మాజీ సీఈవో ఇంద్రాణి ముఖర్జియాతోపాటు మరో 38 మంది సహ మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు జైలు అధికారులు వెల్లడించారు. ఈ 39 మందిని సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్టు తెలిసింది. బైకుల్లా జైలులో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారు. గరిష్టంగా 462 మంది ఖైదీలు ఉండాల్సిన ఈ జైలులో ప్రస్తుతం 306 మంది […]

Update: 2021-04-21 06:44 GMT

ముంబై: మహారాష్ట్రలోని బైకుల్లా జైలులో కరోనా కలకలం రేపింది. ఈ షీనా బోరా మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఐఎన్ఎక్స్ మీడియా మాజీ సీఈవో ఇంద్రాణి ముఖర్జియాతోపాటు మరో 38 మంది సహ మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు జైలు అధికారులు వెల్లడించారు. ఈ 39 మందిని సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్టు తెలిసింది. బైకుల్లా జైలులో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారు. గరిష్టంగా 462 మంది ఖైదీలు ఉండాల్సిన ఈ జైలులో ప్రస్తుతం 306 మంది మహిళా ఖైదీలు, 203 మంది పురుష ఖైదీలున్నారు. జైలులో సామర్థ్యానికి మించి ఖైదీలుండటం సర్వసాధారణంగా కనిపించే చిత్రం. ఈ తరుణంలో జైలులో కరోనా సోకడంపై కలకలం రేగుతున్నది. మహారాష్ట్రలో మొత్తం 44 జైళ్లు ఉండగా ఇందులో గతేడాది ఏప్రిల్ నుంచి 3262 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వివరించారు. తొమ్మిది మంది ఈ మహమ్మారితో మరణించారనీ పేర్కొన్నారు. గతేడాది మహమ్మారి ప్రబలడంతో రాష్ట్రంలో చాలా జైళ్లలో నుంచి క్రౌడ్‌ను తగ్గించడానికి కొంతమందిని తాత్కాలికంగా విడుదల చేసింది. కానీ, ప్రస్తుతం మొత్తం జైళ్ల సామర్థ్యం 26,000 ఉండగా, సుమారు 34,943 మంది ఖైదీలు జైళ్లలో ఉన్నారు.

Tags:    

Similar News