49 మంది బాలకార్మికులను రక్షించిన ములుగు పోలీసులు

దిశ, ములుగు: విద్యా హక్కు చట్టం ప్రకారం చదువుకోవడం బాలల ప్రాథమిక హక్కు అని, అది కాదని బాలలను ఎవరైనా పనిలో పెట్టుకున్నట్లైతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ములుగు ఏఎస్పి పోతురాజు సాయి చైతన్య సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో 49 మంది బాల కార్మికుల ను రక్షించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఆపరేషన్ ముస్కాన్ VII లో భాగంగా జూలై 1 నుండి 31 వరకు ములుగు జిల్లా పోలీసుల […]

Update: 2021-08-05 11:44 GMT

దిశ, ములుగు: విద్యా హక్కు చట్టం ప్రకారం చదువుకోవడం బాలల ప్రాథమిక హక్కు అని, అది కాదని బాలలను ఎవరైనా పనిలో పెట్టుకున్నట్లైతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ములుగు ఏఎస్పి పోతురాజు సాయి చైతన్య సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో 49 మంది బాల కార్మికుల ను రక్షించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఆపరేషన్ ముస్కాన్ VII లో భాగంగా జూలై 1 నుండి 31 వరకు ములుగు జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీలు. చేస్తారు. ములుగు జిల్లా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ VII లో భాగంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఆదేశాల మేరకు ఇద్దరు ఎస్ఐలు ఒక హెడ్ కానిస్టేబుల్ , ముగ్గురు కానిస్టేబుల్ లు, నలుగురు డబ్ల్యూ పి సి ల తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని వివిధ శాఖల సమన్వయంతో ములుగు జిల్లా లోని వివిధ హోటల్,భవనాలు నిర్మించే ప్రదేశాలు,కిరాణా షాపులు, ఫ్యాక్టరీస్, కాటన్ ఇండస్ట్రీలలో తనిఖీలు నిర్వహించగా అందులో పనిచేసే 49 మంది బాలకార్మికులను జిల్లా 1 నుంచి 31 వరకు రక్షించి . అట్టి బాల కార్మికుల యొక్క తల్లిదండ్రులను పిలిపించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆధ్వర్యంలో బాల కార్మికుల ను వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు గా ఏ ఎస్ పి తెలిపారు అదేవిధంగా కార్మికులతో పని చేయించుకున్న హోటల్స్ షాపులు మొదలైన వాటియొక్క యజమానులకు బాలకార్మిక చట్టం లోని సెక్షన్స్ తో డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్ ద్వారా కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా హక్కు చట్టం ప్రకారం చదువుకోవడం బాలల ప్రాథమిక హక్కు అని తెలిపారు. మరియు బాలలను ఎవరి పనిలో పెట్టుకోకూడదని వారి హక్కులను కాల రాయకూడదని హెచ్చరించారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారి పిల్లలను చదివించాలని మరియు తల్లిదండ్రులు లేని పిల్లలను వారి బంధువులు తీసుకెళ్లి బాలలు చదువుకునేలా చూడాలని కోరారు. బాల కార్మికులను ఉద్యోగంలో పెట్టుకున్న వ్యాపారస్తుల పై చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇకముందు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ VII లో పాల్గొని విజయవంతం చేసిన పోలీస్ అధికారులకు , వివిధ శాఖల అధికారులందరికీ ములుగు ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఐపిఎస్ అభినందనలు తెలియజేశారు.

Tags:    

Similar News