టిక్‌టాక్‌ కొనుగోలు పై రిలయన్స్ ఆలోచన!

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తం(World wide)గా ఎక్కువగా నిషేధానికి గురైన సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ టిక్‌టాక్ (Tictok) తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇదివరకే భారత్‌ (India)లో దీన్ని నిషేధించగా, అమెరికా (Us) సైతం నిషేధానికి సిద్ధమనే సంకేతాలనిచ్చింది. మరికొన్ని దేశాలు కూడా ఇదే బాటలో ఆలోచిస్తున్నాయి. అయితే, తాజాగా భారత అతిపెద్ద పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh ambani) టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. […]

Update: 2020-08-13 04:08 GMT
టిక్‌టాక్‌ కొనుగోలు పై రిలయన్స్ ఆలోచన!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ :

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తం(World wide)గా ఎక్కువగా నిషేధానికి గురైన సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ టిక్‌టాక్ (Tictok) తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇదివరకే భారత్‌ (India)లో దీన్ని నిషేధించగా, అమెరికా (Us) సైతం నిషేధానికి సిద్ధమనే సంకేతాలనిచ్చింది. మరికొన్ని దేశాలు కూడా ఇదే బాటలో ఆలోచిస్తున్నాయి. అయితే, తాజాగా భారత అతిపెద్ద పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh ambani) టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

దీనికి సంబంధించి టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ (Byte dance)తో ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే భారత్‌లోని టిక్‌టాక్ వ్యాపారం మొత్తాన్ని రిలయన్స్ చేతిలో పెట్టేయాలని బైట్‌డ్యాన్స్ భావిస్తున్నట్టు, ఇందులో భాగంగా టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ (Ceo Kevin), రిలయన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించారని తెలుస్తోంది. ఇరు కంపెనీల మధ్య జులైలోనే చర్చలు ప్రారంభమయ్యాయని, అయితే, తుది నిర్ణయానికి ఇంకా సమయం పట్టొచ్చని నివేదికలు అభిప్రాయపడ్డాయి.

కాగా, ఈ అంశంపై రిలయన్స్(Reliance) స్పందించడానికి నిరాకరించింది. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్‌లైన్ సెప్టెంబర్ 15వ తేదీకి ముందే టిక్‌టాక్ వాటా కొనుగోలుకు టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్(Microsoft) చర్చలు కూడా ఈ ఊహాగానాలను ప్రాధాన్యత కలిగింది. ఒకవేళ ఇది నిజమైతే, ఇదివరకు భారత ప్రభుత్వం చైనా(China)తో సరిహద్దు వివాదం, జాతీయ భద్రత(National security), డేటా గోప్యత లాంటి కారణాలతో టిక్‌టాక్‌తో పాటు చైనాకే చెందిన 58 యాప్‌లను నిషేధం(Ban) విధించంది. దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance industries) చొరవతో టిక్‌టాక్‌పై ఈ నిషేధం తొలుగుతుందేమో చూడాలి.

Tags:    

Similar News