2జీని ఎత్తేయడం బెటర్ : ముఖేశ్ అంబానీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశంలో ఉన్న 2జీ సేవలను దశలవారీగా ఎత్తేయాలని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం విభాగం జియో కేవలం 4జీ సేవలను మాత్రమే అందిస్తుండగా, త్వరలో 5జీ సేవలను అందుబాటులో తీసుకు రావడానికి సిద్ధమవుతోంది. దేశంలో మొబైల్ టెలిఫోన్ అందుబాటులోకి వచ్చి 25 ఏళ్లు నిండిన సందర్భంగా ‘దేశ్ కీ డిజిటల్ ఉడాన్’ కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా అనేకమంది ఇంకా 2జీ నెట్‌వర్క్‌లో ఉన్నారని చెప్పారు. […]

Update: 2020-07-31 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం దేశంలో ఉన్న 2జీ సేవలను దశలవారీగా ఎత్తేయాలని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం విభాగం జియో కేవలం 4జీ సేవలను మాత్రమే అందిస్తుండగా, త్వరలో 5జీ సేవలను అందుబాటులో తీసుకు రావడానికి సిద్ధమవుతోంది.

దేశంలో మొబైల్ టెలిఫోన్ అందుబాటులోకి వచ్చి 25 ఏళ్లు నిండిన సందర్భంగా ‘దేశ్ కీ డిజిటల్ ఉడాన్’ కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ మాట్లాడారు. దేశవ్యాప్తంగా అనేకమంది ఇంకా 2జీ నెట్‌వర్క్‌లో ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా వీరు 30 కోట్ల మంది దాకా ఉన్నారు. ప్రపంచం ఇప్పుడు 5జీ నెట్‌వర్క్‌ను వినియోగించే పనిలో ఉందన్నారు. దేశీయ ఇతర టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఆపరేటర్లు 3జీ సేవలను నెమ్మదిగా తొలగించినా వారి వినియోగదారుల్లో ఇంకా 2జీ యూజర్లు ఉన్నారు. వీరి సేవల కోసం కంపెనీలు భారీగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. దీంతో బకాయిలు పెరుగుతున్నాయి. ఇటీవల ఎయిర్‌టెల్ కంపెనీ ఓ ప్రకటనలో పూర్తిగా 4జీకి మారేందుకు మరికొంత సమయం పడుతుందని, 2జీని మూసేయాలనే ఆలోచన ఇప్పుడు లేదని తెలిపింది.

Tags:    

Similar News