రూ.1.4లక్షల కోట్లు పోగొట్టుకున్న ముఖేశ్ అంబానీ!
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.1.4లక్షల కోట్లు పొగొట్టుకున్నాడు. గత మూడు త్రైమాసికాల్లో రిలయన్స్ షేర్ వాల్యూ క్రమంగా పడిపోతూ వస్తోంది. రిలయన్స్ వాటాల విలువ సోమవారం నుంచి 5.4 శాతం పడిపోగా బుధవారం ఒక్కరోజే 2.4 శాతం తగ్గింది. దీంతో ముఖేశ్ అంబానీ RIL భారీ నష్టాన్ని చవిచూసినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా రిలయన్స్‌కు చెందిన రిఫైనరీస్, మినరల్స్, […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో నెంబర్ వన్‌గా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ రూ.1.4లక్షల కోట్లు పొగొట్టుకున్నాడు. గత మూడు త్రైమాసికాల్లో రిలయన్స్ షేర్ వాల్యూ క్రమంగా పడిపోతూ వస్తోంది. రిలయన్స్ వాటాల విలువ సోమవారం నుంచి 5.4 శాతం పడిపోగా బుధవారం ఒక్కరోజే 2.4 శాతం తగ్గింది. దీంతో ముఖేశ్ అంబానీ RIL భారీ నష్టాన్ని చవిచూసినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
ప్రధానంగా రిలయన్స్‌కు చెందిన రిఫైనరీస్, మినరల్స్, ఆయిల్ కంపెనీలకు చెందిన షేర్స్ వాల్యూ పడిపోయినట్లు సమాచారం. ఇదిలాఉండగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ రిలయన్స్‌ను అధిగమించి రూ.12.15 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో దేశంలోని అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవించింది.