అంబానీని వెనక్కి నెట్టిన జాక్ మా!

దిశ, వెబ్‌డెస్క్: 2018 నుంచి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ…సోమవారం నాటి మార్కెట్ల పరిణామంతో మొదటి స్థానాన్ని కోల్పోయారు. టెలికాం, ఆయిల్, రిటైల్ వంటి అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్న ముఖేశ్ అంబానీ ఆసియా అత్యంత ధనవుంతుడి జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు. మొదటి స్థానంలోకి అలీబాబా గ్రూపు అధినేత జాక్ మా నిలిచారు. ఆయిల్‌, రిటైల్‌, టెలికంలతో పాటు వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన […]

Update: 2020-03-10 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2018 నుంచి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ…సోమవారం నాటి మార్కెట్ల పరిణామంతో మొదటి స్థానాన్ని కోల్పోయారు. టెలికాం, ఆయిల్, రిటైల్ వంటి అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్న ముఖేశ్ అంబానీ ఆసియా అత్యంత ధనవుంతుడి జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు. మొదటి స్థానంలోకి అలీబాబా గ్రూపు అధినేత జాక్ మా నిలిచారు.

ఆయిల్‌, రిటైల్‌, టెలికంలతో పాటు వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తాజాగా తన స్థానాన్ని కోల్పోయారు. రెండోస్థానంలో ఉన్న అలీబాబా గ్రూపు అధినేత జాక్‌ మా మొదటిస్థానంలోకి వచ్చారు. అంతర్జాతీయంగా వ్యాపిస్తున్న కరోనా దెబ్బకు ప్రపంచ దేశాల మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. సోమవారం ఒక్క రోజే సెన్సెక్స్ 1,942 పాయింట్లు నష్టంతో మదుపర్ల సంపద రూ. 7.72 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. ఈ పరిస్థితి చరిత్రలోనే అత్యంత భారీ పతనం. దీనికి తోడు సౌదీ అరేబియా, రష్యాల మధ్య చమురు సెగ రాజుకోవడంతో మార్కెట్లు కృంగిపోవడానికి కారణమయ్యాయి. ఈ స్థాయిలో మార్కెట్లు క్షీణించడంతో రిలయన్స్ షేర్లు 5.8 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. దీంతో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సంపద తగ్గి ఆసియాలోనే అత్యంత ధనవంతుడి జాబితాలో తొలిస్థానం నుంచి రెండో స్థానానికి చేరారు.

ప్రస్తుతం జాక్ మా సంపద 44.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ముఖేశ్ అంబానీ సంపద కంటే 2.6 బిలియన్ డాలర్లు అధికం. ప్రస్తుతం ముఖేశ్ అంబానీ సంపద 41.9 బిలియన్ డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. రిలయన్స్ ఇండస్ట్రెస్స్‌కి సంబంధించి షేర్లు సోమవారం సుమారు 12 శాతం వరకూ పడిపోయాయి.

Tags:    

Similar News