ముద్ర ఉద్యోగుల ధర్నా.. ఖాతాదారుల్లో ఫుల్ టెన్షన్

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి రీజియన్‌కు సంబంధించిన ముద్ర అగ్రికల్చర్ నైపుణ్య అభివృద్ధి ఉద్యోగులు ధర్నాకు దిగారు. గత ఆరేడు నెలలుగా జీతాలు, ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న క్రమంలో యజమాన్యంపై ఒత్తిడి తేవడానికి ఉద్యోగులంత ఏకతాటిపైకి వచ్చారు. బుధవారం ఉదయం రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట రైల్వే స్టేషన్ల నుంచి ఉద్యోగులు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు చేరకున్నారు. వారంతా హైదరాబాద్‌లో ఒక చోటకు చేరుకున్న అనంతరం నల్లకుంటలోని హెడ్ ఆఫీస్ ముందు రోడ్డుపైన […]

Update: 2021-10-20 05:56 GMT

దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి రీజియన్‌కు సంబంధించిన ముద్ర అగ్రికల్చర్ నైపుణ్య అభివృద్ధి ఉద్యోగులు ధర్నాకు దిగారు. గత ఆరేడు నెలలుగా జీతాలు, ఖాతాదారులకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న క్రమంలో యజమాన్యంపై ఒత్తిడి తేవడానికి ఉద్యోగులంత ఏకతాటిపైకి వచ్చారు.

బుధవారం ఉదయం రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట రైల్వే స్టేషన్ల నుంచి ఉద్యోగులు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు చేరకున్నారు. వారంతా హైదరాబాద్‌లో ఒక చోటకు చేరుకున్న అనంతరం నల్లకుంటలోని హెడ్ ఆఫీస్ ముందు రోడ్డుపైన బైఠాయించి.. ఖాతాదారుల డబ్బులు వెంటనే ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో పెద్దపల్లి రీజియన్ జెడ్.ఎం, ఆర్.ఎంలు, బీ.ఎం ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:    

Similar News