మ్యూకర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ప్రాణాంతక అంటు వ్యాధి

దిశ, తెలంగాణ బ్యూరో: మ్యూకర్ మైకోసిస్ ప్రాణాంతక అంటు వ్యాధని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. వ్యాధి తీవ్రత పెరిగిన వారిలో ముక్కు, గొంతు, కంటి అవయవాలకు చికిత్సలు చేయాల్సి ఉంటుందని ఉంటుందని తెలపారు. వ్యాధి ప్రారంభంలో గుర్తించక పోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ వ్యాధి సోకి కంటి సంబంధిత సమస్యలు తెలెత్తిన వారి కోసం హాట్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. 18002002211 నెంబర్ ద్వారా సోమవారం నుంచి […]

Update: 2021-05-21 08:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మ్యూకర్ మైకోసిస్ ప్రాణాంతక అంటు వ్యాధని ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. వ్యాధి తీవ్రత పెరిగిన వారిలో ముక్కు, గొంతు, కంటి అవయవాలకు చికిత్సలు చేయాల్సి ఉంటుందని ఉంటుందని తెలపారు. వ్యాధి ప్రారంభంలో గుర్తించక పోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ వ్యాధి సోకి కంటి సంబంధిత సమస్యలు తెలెత్తిన వారి కోసం హాట్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. 18002002211 నెంబర్ ద్వారా సోమవారం నుంచి శనివారం వరకకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలందిస్తామని చెప్పారు.

కొవిడ్ తరువాత అత్యంత వేగంగా విస్తరిస్తున్న మ్యూకర్ మైకోసిస్ చికిత్సల గురించి సమాచారం అందించేందకు ఈ హాట్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, నిర్మల్‌, రంగారెడ్డి, కొత్తూర్‌, సిద్ధిపేటల్లో కూడా ఎల్‌వీపీఈఐ సెకండరీ కేర్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అత్యవసర చికిత్సలు అవసరమైన వారు ఆయా కేంద్రాలను సంప్రదించి సరైన సేవలను పొందవచ్చని సూచించారు.

ఇంట్లో ఉన్న రోగులకు సేవందించేందుకు టెలికన్సల్టేషన్‌ సేవలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. మ్యూకోర్‌మైకోసిస్‌ వ్యాధిని బ్లాక్ ఫంగస్ గా పిలవడం తప్పని సూచించారు. ఇది ముక్కు, గొంతు, కళ్లు, మెదడుకు సోకే ఫంగల్‌ అంటువ్యాధిగా చెప్పుకొచ్చారు. తీవ్రమైన డయాబిటీస్ వ్యాధి కలిగిన పేషెంట్లకు, కొవిడ్‌–19 చికిత్స కోసం స్టెరాయిడ్స్‌ తీసుకున్న పేషెంట్లకు, కరోనా చికిత్సలో ఆక్సిజన్‌ అధికంగా తీసుకున్న వారికి మ్యూకోర్‌మైకోసిస్‌ ఎక్కువ సోకే అవకాశాలున్నాయని వివరించారు. వీరితో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న పేషెంట్లకు, కాలిన గాయాల బారిన పడిన పేషెంట్లకు కూడా మ్యూకర్ మైకోసిస్ సోకుతుందని తెలిపారు.

ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు దిబ్బడ, సైనటిస్‌, సైనసెస్‌ (దవడ ఎముకలు) వద్ద నొప్పి, దంతాల నొప్పి, కంటిచూపు అకస్మాత్తుగా తగ్గడం, పై కనురెప్ప వాలిపోవడం (పోసిస్‌), కళ్లు అసాధారణంగా ఉబ్బడం, అంగిలిపై నల్లటిమరకలు లేదంటే ముక్కునుంచి నల్లని ద్రవాలు రావడం వంటి లక్షణాలుంటాయని వివరించారు. ఈ సమస్యలున్నవారు ఈఎన్‌టీ, కంటి డాక్టర్లను వీలైనంత త్వరగా సంప్రదించాలని సూచించారు. ఈ వ్యాధి ప్రబలితే ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మరణానికీ దారితీసే ప్రమాదాలున్నాయి.

ఎంఆర్‌ఐ స్కానింగ్ తీయడం ద్వారా మ్యుకోర్‌ ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను తెలుసుకోవచ్చిన్నారు. ప్రాథమిక దశలోనే ఫంగస్‌ను గుర్తించడం ద్వారా ఇంట్రావీనస్‌, లోకల్‌ యాంటీ ఫంగల్‌ ఇంజెక్షన్స్‌ అందించి వ్యాధిని తగ్గించవచ్చని సూచించారు. వ్యాధి తగ్గిన తరువాత కూడా పేషెంట్లు చాలా కాలం పాటు యాంటీ ఫంగల్‌ ఔషదాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఫంగస్ తీవ్రత ఎక్కవగా ఉంటే సర్జరీలు చేసి సంబంధిత అవయవాలను తొలగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కంటి సంబంధిత సమస్యలు తలెత్తుతే కంటి వెనుక భాగంలో ఇంజెక్షన్లుచేయడం లేదా కంటిని పూర్తిగా తొలగించాల్సి ఉంటుందని చెప్పారు.

Tags:    

Similar News