ధోనీ కెప్టెన్ కావడంతో గొప్ప క్రికెటర్‌ను కోల్పోయాం: గంభీర్

దిశ, స్పోర్ట్స్: మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ టీమ్‌ఇండియాకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. 2004లో అతడు టీమ్‌ఇండియాలో అడుగుపెట్టినప్పుడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 2007లో కెప్టెన్‌గా అయిన తర్వాత మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ విషయంపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ వేరేలా స్పందించాడు. ‘ధోనీ టీమ్ఇండియా కెప్టెన్‌ అయిన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగలేదు. అతడు మ్యాచ్ ముగింపు చేయడంపైనే […]

Update: 2020-06-14 08:42 GMT

దిశ, స్పోర్ట్స్: మిస్టర్ కూల్, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ టీమ్‌ఇండియాకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించాడు. 2004లో అతడు టీమ్‌ఇండియాలో అడుగుపెట్టినప్పుడు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 2007లో కెప్టెన్‌గా అయిన తర్వాత మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ విషయంపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ వేరేలా స్పందించాడు. ‘ధోనీ టీమ్ఇండియా కెప్టెన్‌ అయిన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగలేదు. అతడు మ్యాచ్ ముగింపు చేయడంపైనే దృష్టి పెట్టి తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకున్నాడు. అసలు ధోనీ కెప్టెన్ కాకుంటే మూడో స్థానంలో ఆడి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేవాడు. అంతేకాదు తన కెరీర్‌లో మరిన్ని పరుగులు చేసేవాడు. ప్రపంచం ఒక గొప్ప బ్యాట్స్‌మాన్‌ను చూడలేకపోయింది’ అని గంభీర్ క్రికెట్ కనెక్టడ్ కార్యక్రమంలో చెప్పాడు. ఈ విషయం నేను చెప్పడం కాదు. అతడి రికార్డులే తెలియజేస్తాయి. మూడో స్థానంలో 16 మ్యాచ్‌లే ఆడినా 82 స్ట్రైక్ రేటుతో 1000 పరుగులు చేశాడు. అదే స్థానంలో మరిన్ని ఇన్నింగ్స్‌లు ఆడుంటే గొప్ప బ్యాట్స్‌మాన్ అయ్యేవాడు. కానీ, జట్టు గురించి ఆలోచించి మంచి ఫినిషర్ అయ్యాడని గౌతమ్ చెప్పాడు.

Tags:    

Similar News