పాంటింగ్ కంటే ధోనీనే బెస్ట్ కెప్టెన్: అఫ్రీది
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు ఎన్నో రికార్డులు ఉన్నాయి. రెండు సార్లు ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన ఘనత పాంటింగ్‌దే. అయితే కెప్టెన్‌గా పాంటింగ్ కంటే ధోనీనే బెస్ట్ అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ అంటున్నాడు. ట్విట్టర్ వేదికగా అఫ్రీది తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఒక అభిమాని ‘బెటర్ కెప్టెన్ ధోనీ లేక పాంటింగ్? లాలా చాయిస్?’ అని ప్రశ్నించాడు. […]
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌కు ఎన్నో రికార్డులు ఉన్నాయి. రెండు సార్లు ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన ఘనత పాంటింగ్‌దే. అయితే కెప్టెన్‌గా పాంటింగ్ కంటే ధోనీనే బెస్ట్ అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ అంటున్నాడు. ట్విట్టర్ వేదికగా అఫ్రీది తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఒక అభిమాని ‘బెటర్ కెప్టెన్ ధోనీ లేక పాంటింగ్? లాలా చాయిస్?’ అని ప్రశ్నించాడు. దీనికి అఫ్రిదీ తనకు బెస్ట్ కెప్టెన్ ధోనీనే అని బదులిచ్చాడు. ‘ధోనీ యువకులతో కూడిన మంచి జట్టును తయారు చేసుకున్నాడు’ అని చెప్పాడు. ఒక విధంగా అఫ్రీది చెప్పిన దాంట్లో చాలా నిజం ఉంది. కెప్టెన్లుగా ఇద్దరినీ పోలిస్తే ధోనీనే బెస్ట్ అనక తప్పదు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీతో ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక సారథిగా ధోనీ గుర్తింపుపొందాడు. టీం ఇండియాను టెస్టుల్లో కూడా నెంబర్ వన్ స్థానంలో నిలిపాడు. ఇక అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన క్రికెటర్‌గానూ మిస్టర్ కూల్ ధోనీకి రికార్డు ఉంది.