ఎమ్ఆర్ఎఫ్ టైర్స్ నికర లాభం 95 శాతం క్షీణత
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టైర్ల తయారీ సంస్థ ఎమ్ఆర్ఎఫ్ టైర్స్ (MRF Tyres) 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం(Net profit) 95.07 శాతం క్షీంచి రూ. 13.46 కోట్లుగా నమోదైనట్టు శుక్రవారం నివేదించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 273.27 కోట్ల నికర లాభాల(Net profit)ను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 2,460.70 కోట్లుగా ఉందని, ఇది గతేడాది త్రైమాసికంలో రూ. 4,470.82 కోట్లుగా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టైర్ల తయారీ సంస్థ ఎమ్ఆర్ఎఫ్ టైర్స్ (MRF Tyres) 2020-21 ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం(Net profit) 95.07 శాతం క్షీంచి రూ. 13.46 కోట్లుగా నమోదైనట్టు శుక్రవారం నివేదించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 273.27 కోట్ల నికర లాభాల(Net profit)ను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 2,460.70 కోట్లుగా ఉందని, ఇది గతేడాది త్రైమాసికంలో రూ. 4,470.82 కోట్లుగా నమోదైందని రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది.
కొవిడ్-19(kovid-19) వ్యాప్తి కారణంగా కంపెనీ వ్యాపార పనితీరు ప్రభావితమైందని, దీంతో కంపెనీనికి ఆర్థిక నష్టాలు(Financial losses) వచ్చినట్టు వెల్లడించింది. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు లాక్‌డౌన్(Lockdown) ఆంక్షలు విధించడంతో ఎమ్ఆర్ఎఫ్ టైర్స్ ప్లాంట్లు (MRF Tyres Plants ), కార్యాలయాలు(Offices), గోడౌన్లు(Godown) మూసేశామని కంపెనీ తెలిపింది. అయితే, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత దశలవారీగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది. ఇక, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 45 శాతం క్షీణించి రూ. 1,240.58 కోట్లకు చేరిందని, గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 2,072.03 కోట్లుగా నమోదైందని వెల్లడించింది.