CJI ఎన్ వి రమణను కలిసిన వేం వాసుదేవ రెడ్డి..

దిశ, గూడూరు : వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా) ఎన్ వి రమణను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ వేం వాసుదేవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు వారితో పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రజాసేవ చేయుటకు గాను ప్రభుత్వ సర్వీసులకు రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నానని వారికి తెలియజేసినట్టు వివరించారు. ప్రజాప్రతినిధిగా మరియు […]

Update: 2021-12-19 10:22 GMT

దిశ, గూడూరు : వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా) ఎన్ వి రమణను ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ వేం వాసుదేవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు వారితో పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రజాసేవ చేయుటకు గాను ప్రభుత్వ సర్వీసులకు రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నానని వారికి తెలియజేసినట్టు వివరించారు.

ప్రజాప్రతినిధిగా మరియు గ్రానైట్ పరిశ్రమల యజమానులు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నానని చెప్పడంతో వారు అభినందనలు తెలిపారన్నారు. ఉపాధి కల్పన లేక యువత చెడు మార్గంలో వెళుతున్న క్రమంలో భావితరాల భవిష్యత్తుకు భరోసాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. దేశాభివృద్ధికి గ్రామాలే కీలకం కావున స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు.

Tags:    

Similar News