రాముడు, సీత, రావణాసురుడు @పెట్రోల్ ధరలు

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెట్రోల్ ధరలు గత నెలరోజుల కాలంలో ఐదు నుంచి ఆరుసార్లు పెరిగాయి. దీనికి తోడు కేంద్రం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చమురుపై అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్(AIDC)సెస్ విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.2.5 మరియు డీజిల్ పై రూ.4 పెరగనున్నట్లు తెలుస్తోంది. పామోలిన్ ఉత్పత్తులు, వంటనూనెలపై కూడా ఈ పన్ను వర్తించున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మాలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేర్కొంది. అయితే, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ […]

Update: 2021-02-02 06:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెట్రోల్ ధరలు గత నెలరోజుల కాలంలో ఐదు నుంచి ఆరుసార్లు పెరిగాయి. దీనికి తోడు కేంద్రం సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చమురుపై అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్(AIDC)సెస్ విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.2.5 మరియు డీజిల్ పై రూ.4 పెరగనున్నట్లు తెలుస్తోంది. పామోలిన్ ఉత్పత్తులు, వంటనూనెలపై కూడా ఈ పన్ను వర్తించున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మాలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పేర్కొంది.

అయితే, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్లకు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని, ఇది సామాన్యుడిపై మరింత పెనుభారం మోపనుందని ఆర్థిక నిపుణులు, ప్రతిపక్ష, విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వలన దేశంలో సుమారు 2 కోట్ల మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. మరికొందరు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పోవడం మధ్య తరగతి ప్రజల నడ్డి విరవడమే అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ ధరలు రూ.90 మార్క్‌ను దాటాయి. రాజస్థాన్‌లో గత ఐదురోజుల కిందట (జనవరి28న) సెంచరీని దాటింది. ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం టాక్స్‌లు తగ్గించింది. దీంతో ప్రస్తుతం అక్కడ పెట్రోల్ ధర రూ.92గా కొనసాగుతుండగా, డీజిల్ రూ.85గా ఉంది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై కేంద్ర బడ్జెట్‌లోని అంశాలు ములిగే నక్కపై తాటిపండు పడినట్లు అయిందని అంతా అనుకుంటున్నారు.

అయితే, కేంద్రం అవలంభిస్తున్న విధానాలపై బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి తనదైన రీతిలో సెటైర్లు వేశారు. ఇండియన్ ఎకానమీ మీద మంచి పట్టున్న స్వామి… కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసహనం వ్యక్తంచేశారు. ఆర్థికవృద్ధిని గాడిన పెట్టడంలో కేంద్రం విఫలమైందని పలుమార్లు ట్విట్టర్ వేదికగా విమర్శించిన విషయం తెలిసిందే. తాజాగా చమురు ధరలు పెరుగుతుండటంపై.. బేసిగ్గా దేవుడిని ఆరాధించే స్వామి తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. ‘‘రాముడు పుట్టిన ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర రూ.93గా ఉంటే.. సీతాదేవి జన్మస్థలం నేపాల్‌లో రూ.53గా ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భారతీయులు దసరా పండుగకు రావణాసురుడిని దహనం చేయడం ఆనవాయితీ. అలాంటి రావణుడు జన్మించిన శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.51గా ఉందని కేంద్రానికి చురకలు అంటించారు’’. ఇదిలాఉండగా, చమురు ధరల పెరుగుదలపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కేంద్రాన్ని బహిరంగంగా విమర్శించడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడటం లేదని తెలుస్తోంది. కాగా, చమురు ధరలపై విధించిన అగ్రికల్చర్ సెస్ వలన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న స్పష్టం చేయగా.. ఇవాళ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన పోస్టు వైరల్‌‌గా మారింది.

Tags:    

Similar News