గిరిజన యూనివర్సిటీ కావాలి.. సోయం బాపూరావు డిమాండ్

దిశ, ఆదిలాబాద్: అన్ని వనరులతో అనుకూలంగా ఉన్న ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ సోయం బాబూరావు అధికారులను కోరారు. బుధవారం ఢిల్లీలో గిరిజన సలహామండలి కమిటీ సమావేశం కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా అధ్యక్షతన నిర్వహించారు. జరిగిన సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యుడు సోయం బాపురావు పాల్గొని మాట్లాడారు.. తెలంగాణలో అన్ని జిల్లాలో యూనివర్సిటీలో ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లా ఉన్నత విద్యకు నోచుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన […]

Update: 2021-08-11 10:48 GMT

దిశ, ఆదిలాబాద్: అన్ని వనరులతో అనుకూలంగా ఉన్న ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ సోయం బాబూరావు అధికారులను కోరారు. బుధవారం ఢిల్లీలో గిరిజన సలహామండలి కమిటీ సమావేశం కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా అధ్యక్షతన నిర్వహించారు. జరిగిన సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యుడు సోయం బాపురావు పాల్గొని మాట్లాడారు.. తెలంగాణలో అన్ని జిల్లాలో యూనివర్సిటీలో ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లా ఉన్నత విద్యకు నోచుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజన యూనివర్సిటీని వరంగల్ జిల్లాకు మళ్లించిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నత విద్యా అవకాశాలు మెరుగు పరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురైన ఆదివాసీ బిడ్డలకు న్యాయం చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జీవో 3ను సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ గిరిజన సంక్షేమ శాఖ దీనిపై ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ఏజెన్సీలో జీవో నంబర్ 3 అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని కోరారు.

Tags:    

Similar News