అమ్మవారి సేవలో ఎంపీ రేవంత్ రెడ్డి
దిశ, ఉప్పల్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కుషాయిగూడలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో […]
దిశ, ఉప్పల్ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం కుషాయిగూడలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శీరిషా సోశమేఖర్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు తోటకూర జంగయ్య యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ యాదవ్, ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, సీనియర్ నాయకులు సీతారాం రెడ్డి, బొర్ర రాఘవరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.