నాసిరకంగా కోహెడ్ మార్కెట్ పనులు: ఎంపీ రేవంత్‌రెడ్డి
దిశ, రంగారెడ్డి: పనులు నాసిరకంగా చేపట్టడంతోనే కోహెడ మార్కెట్ యార్డులో షెడ్లు కుప్పకూలాయని, ఇందుకు బాధ్యులైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం కోహెడ్ పండ్ల మార్కెట్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత వల్లే కొత్తగా నిర్మించిన పండ్ల మార్కెట్ నేల మట్టం అయ్యిందన్నారు. సరైన వసతులు, ఏర్పాట్లు చేయకుండా కొత్తపేట నుంచి కోహెడకు మార్కట్ తరలించడం వల్ల రైతులు […]
దిశ, రంగారెడ్డి: పనులు నాసిరకంగా చేపట్టడంతోనే కోహెడ మార్కెట్ యార్డులో షెడ్లు కుప్పకూలాయని, ఇందుకు బాధ్యులైన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం కోహెడ్ పండ్ల మార్కెట్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత వల్లే కొత్తగా నిర్మించిన పండ్ల మార్కెట్ నేల మట్టం అయ్యిందన్నారు. సరైన వసతులు, ఏర్పాట్లు చేయకుండా కొత్తపేట నుంచి కోహెడకు మార్కట్ తరలించడం వల్ల రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని ఎంపీ డిమాండ్ చేశారు. షెడ్లు కూలి రైతుల మీద పడటంతో గాయాలపాలైన రైతులకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా నష్ట పరిహారం కూడా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి, నాయకులు దేప భాస్కర్ రెడ్డి, మర్రి నిత్య నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags: quality less works, take action against contractor, mp revanth reddy, cp mahesh bhagwat