విజయసాయిరెడ్డిని దొంగ అంటూ మళ్లీ రెచ్చిపోయిన RRR
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఐడీ డీజీ సునీల్ కుమార్, ఎంపీ విజయసాయిరెడ్డితో మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. తన ఫోన్‌ను తీసుకున్న సునీల్ కుమార్, ఆ ఫోన్ నుంచి కొందరికి మెసేజ్‌లు పంపారని ఆరోపించారు. ఫోన్‌ను వాడకుండానే, దాని నుంచి మెసేజులు పంపగల ఘనుడు సీఐడీ డీజీ అంటూ కీలక […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఐడీ డీజీ సునీల్ కుమార్, ఎంపీ విజయసాయిరెడ్డితో మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. తన ఫోన్‌ను తీసుకున్న సునీల్ కుమార్, ఆ ఫోన్ నుంచి కొందరికి మెసేజ్‌లు పంపారని ఆరోపించారు. ఫోన్‌ను వాడకుండానే, దాని నుంచి మెసేజులు పంపగల ఘనుడు సీఐడీ డీజీ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో సునీల్ కుమార్‌కు భార్యతో మనస్పర్థలు వచ్చాయని ఆ సమయంలో ఆయన భార్య అనుమతి లేకుండా ఆమె వినియోగించే కంప్యూటర్ నుంచి అందరికీ మెసేజ్‌లు పంపినట్లు ఆరోపించారు. అదే తరహాలో తన ఫోన్ నెంబర్ ఉపయోగించే మెసేజ్‌లు పంపారన్నారు. అంతేకాదు సునీల్ కుమార్ పెగాసెస్ తరహా సాఫ్ట్‌వేర్‌లు ఉపయోగిస్తూ ఇలాంటి మెసేజ్‌లు షేర్ చేస్తున్నారన్నారు.
తనకు వేరొకరితో సంబంధం అంటగట్టి వారి నుంచి కొంత అమౌంట్ వస్తుందని ఓ మెసేజ్ క్రియేట్ చేశారని ధ్వజమెత్తారు. వాస్తవానికి ఆ అకౌంట్ తనది కాదని ఎంపీ రఘురామ తెలిపారు. అయితే ఆ మెసేజ్‌లను ఆధారం చేసుకుని సునీల్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్టు, ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసిందన్నారు. ఆ పిటిషన్ తాలూకు ప్రతి సాక్షికి వచ్చిందని ఆరోపించారు. సునీల్ కుమార్ ఫిర్యాదు చేస్తే అది సాక్షికి ఎలా వచ్చిందని నిలదీశారు. ఎంపీలను తీసుకుని ఢిల్లీలో అందరినీ కలుస్తున్న దొంగోడు విజయసాయిరెడ్డికి ఆ పిటిషన్ ప్రతి ఎలా అందిందని నిలదీశారు. అంటే సునీల్ కుమార్, విజయసాయిరెడ్డిలు మిలాఖాత్ అయ్యారనడానికి ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఇద్దరూ తోడుదొంగలేనంటూ ఎంపీ రఘురామ ఆరోపించారు.