పాదయాత్రకు సిద్ధమైన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి

దిశ, భువనగిరి: బ్రా‌హ్మణవెల్లెంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల‌ను యుద్ధప్రాతిపాదికన పూర్తిచేయాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుంచి 26 వరకు నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లెంల నుంచి హైదరాబాద్ ఈఎన్సీ కార్యాలయం ఎర్రమంజిల్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలాదిమంది రైతులతో పాదయాత్రకు సిద్ధమైనట్లు చెప్పారు. వారం రోజుల పాటు […]

Update: 2021-02-13 09:47 GMT

దిశ, భువనగిరి: బ్రా‌హ్మణవెల్లెంల, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల‌ను యుద్ధప్రాతిపాదికన పూర్తిచేయాల‌ని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 నుంచి 26 వరకు నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లెంల నుంచి హైదరాబాద్ ఈఎన్సీ కార్యాలయం ఎర్రమంజిల్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేలాదిమంది రైతులతో పాదయాత్రకు సిద్ధమైనట్లు చెప్పారు. వారం రోజుల పాటు 120 కిలోమీట‌ర్ల మేర యాత్ర సాగుతుందన్నారు.

యాత్రకు అనుమతి కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు, నల్లగొండ ఎస్పీకి లేఖ రాసినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ నాగార్జునసాగర్​ గెలుపు కోసం కపట ప్రేమ ఒలకబోస్తున్నాడని, ఏడేళ్ల నుంచి ప్రాజెక్టులను ఎందుకు పెండింగ్​లో పెట్టాల్సి వచ్చిందో బహిర్గతం చేయాలని డిమాండ్​ చేశారు. శాంతియుతంగా తలపెట్టిన యాత్రకు పార్టీలకు అతీతంగా తరలిరావాలని కోరారు. ఎర్రమంజిల్​లోని ఈఎన్సీని కలిసి వినతి పత్రం అందజేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం వద్దనే ఆమ‌ర‌ణ దీక్షకు దిగుతానని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News