‘మంత్రి తలసాని బహిరంగ క్షమాపణ చెప్పాలి’

దిశ, భువనగిరి: గంగపుత్రులను కించపరిచే విధంగా మంత్రి తలసాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గంగపుత్రులు నిరసన తెలిపారు. సోమవారం కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ తీసి, అనంతరం తలసాని దిష్టి బొమ్మ దహనం చేశారు. మంత్రి తలసాని గంగపుత్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, జీఓ నెంబర్ 6ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని గంగపుత్రులకు […]

Update: 2021-01-18 06:39 GMT

దిశ, భువనగిరి: గంగపుత్రులను కించపరిచే విధంగా మంత్రి తలసాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో గంగపుత్రులు నిరసన తెలిపారు. సోమవారం కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ తీసి, అనంతరం తలసాని దిష్టి బొమ్మ దహనం చేశారు. మంత్రి తలసాని గంగపుత్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, జీఓ నెంబర్ 6ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని గంగపుత్రులకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ… గంగపుత్రులను కించపరిచే విధంగా మాట్లాడటం మంత్రి అహంకారానికి నిదర్శనమన్నారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక కులాన్ని కించపర్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తలసాని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News