‘సుందర్ నాయక్ కుటుంబానికి రూ.2 కోట్లు ఇవ్వాలి’

దిశ, సూర్యాపేట: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదానికి గురై మృతిచెందిన జిల్లా వాసి సుందర్ నాయక్ కుటుంబానికి రూ.2 కోట్లు ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చివ్వేంల మండలంలోని సుందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదానికి, ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. కుటుంబంలో భార్య ప్రమీలకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం […]

Update: 2020-08-26 08:36 GMT

దిశ, సూర్యాపేట: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదానికి గురై మృతిచెందిన జిల్లా వాసి సుందర్ నాయక్ కుటుంబానికి రూ.2 కోట్లు ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం చివ్వేంల మండలంలోని సుందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళ్లర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదానికి, ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు. కుటుంబంలో భార్య ప్రమీలకు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ సీఎండీ ప్రభాకర్ రావుతో ఫోన్‌లో మాట్లాడి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

Tags:    

Similar News