కేసీఆర్ కు రాసిన లేఖలో కోమటిరెడ్డి ఏమన్నారు?
దిశ, న్యూస్‌బ్యూరో: ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సంబంధించిన జీవో 203 అమలైతే నాగార్జున సాగర్ ఎండిపోతదని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తక్షణమే పోతిరెడ్డిపాడు పనులను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం ఎంపీ వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తోన్నదని, అలా జరిగితే […]
దిశ, న్యూస్‌బ్యూరో: ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సంబంధించిన జీవో 203 అమలైతే నాగార్జున సాగర్ ఎండిపోతదని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తక్షణమే పోతిరెడ్డిపాడు పనులను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం ఎంపీ వెంకట్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ద్వారా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తోన్నదని, అలా జరిగితే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే అవకాశముందంటూ ఫైరయ్యారు. డిండి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) ఉదయ సముద్రం ప్రాజెక్టులకు నీటి కరువు ఏర్పడుతుందని, నాగార్జున సాగర్‌కు చుక్క నీరు రాదని ఎంపీ మండిపడ్డారు. హైదరబాద్ జంటనగరాలకు తాగు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. జీవో 203 అమలైతే సీఎం పదవికి రాజీనామా చేయాలని వెంకట్‌రెడ్డి లేఖలో సీఎం కేసీఆర్‌ని డిమాండ్ చేశారు.