టీఆర్ఎస్కు ఓటేస్తే చెప్పుకు వేసినట్లే : బండి సంజయ్
దిశ, వెబ్డెస్క్ : ఎమ్మెల్సీ్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓట్లు వేయొద్దని, ఆ పార్టీకి వేస్తే చెప్పుకు వేసినట్లే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం పదవి తనకు చెప్పుతో సమానమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తుచేశారు. దీంతో రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ ఓటర్లు గులాబీ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యలో టీఆర్ఎస్ లీడర్ల హస్తం ఉండటంపై ముఖ్యమంత్రి స్పందించపోవడం […]
దిశ, వెబ్డెస్క్ : ఎమ్మెల్సీ్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓట్లు వేయొద్దని, ఆ పార్టీకి వేస్తే చెప్పుకు వేసినట్లే అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం పదవి తనకు చెప్పుతో సమానమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తుచేశారు. దీంతో రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ ఓటర్లు గులాబీ పార్టీకి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
న్యాయవాది వామన్ రావు దంపతుల హత్యలో టీఆర్ఎస్ లీడర్ల హస్తం ఉండటంపై ముఖ్యమంత్రి స్పందించపోవడం దారుణమని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ఆయన మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్లో ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి బ్రోకర్ అని.. విద్యను వ్యాపారం చేసి, విద్యావ్యవస్థను నాశనం చేశాడని బండి ఫైర్ అయ్యారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.