‘కేసీఆర్‌’ అంటే ఎంటో చెప్పిన ఎంపీ అర్వింద్..!

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ అబద్ధాల పుట్ట, అవినీతి గుట్ట అని, ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం ఆయనకు మాత్రమే చెల్లుద్దని నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ వ్యాఖ్యానించారు. చాలాకాలం తర్వాత ఫాం హౌజ్ నుంచి బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జునసాగర్ వెళ్లారన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికలకు ప్రచారం కోసం […]

Update: 2021-02-11 11:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ అబద్ధాల పుట్ట, అవినీతి గుట్ట అని, ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం ఆయనకు మాత్రమే చెల్లుద్దని నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ వ్యాఖ్యానించారు. చాలాకాలం తర్వాత ఫాం హౌజ్ నుంచి బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జునసాగర్ వెళ్లారన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికలకు ప్రచారం కోసం అక్కడికి వెళ్లిన కేసీఆర్ కనీసం చిత్రపటానికి నివాళి కూడా అర్పించలేని సంస్కార హీనుడని విమర్శించారు. నిజాం సర్కార్ గొప్పతనం గురించి నల్లగొండ జిల్లాలో పొగిడిన కేసీఆర్ ఒవైసీ, రజాకార్లకు అమ్ముడు పోయారని ఆరోపించారు. ఎన్నికల సభలో గిరిజన మహిళలను కుక్కలతో పోల్చడం కేసీఆర్ అహంకార ధోరణికి నిదర్శనమన్నారు. మహిళలు తిరగబడి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

కొడుకు, కోడలు వెళ్లగొడితే ప్రగతి భవన్ నుంచి పారిపోయి ఫాం హౌజ్‌లో ఉంటున్న కేసీఆర్‌ను ప్రజలు కూడా రాష్ట్రం నుంచి వెళ్లగొడతారన్నారు. గోకాసురులు అంటూ యాదవులను అవమానపరిచే విధంగా మాట్లాడి ఆయన నైజాన్ని ప్రదర్శించారన్నారు. ‘సిస్టర్’ షర్మిలకు త్వరలో పార్టీ పెట్టబోతున్నందుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూనే తెలంగాణ ప్రజలకు రాజన్న రాజ్యం అవసరం లేదన్నారు.

‘మత్తు’ నుంచి కేసీఆర్ బయటకు రావాలి : ఎంపీ సోయం బాపూరావు

ముఖ్యమంత్రిగా ఉంటూ కేసీఆర్ స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, ‘మత్తు’ నుంచి బయటకు రావాలని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. దళితులను, గిరిజనులను అవమానపరిచేలా టీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నా పార్టీ అధ్యక్షుడిగా మౌనంగా ఉంటున్నారని, అలాంటివారిని పార్టీ నుంచి తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు దొర అహంకారం ఇంకా తగ్గలేదని, త్వరలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.

Tags:    

Similar News