రేవంత్‌కు బిగ్ షాక్.. సంచలనంగా మారిన ఎంపీ అరవింద్ వీడియో
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తాను వ్యక్తిగతంగా దూషించలేదని, విమర్శించలేదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి అంకితం చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన ధర్మపురి శ్రీనివాస్ పార్టీ వీక్ అయిందని.. పార్టీలో నుంచి […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తాను వ్యక్తిగతంగా దూషించలేదని, విమర్శించలేదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి అంకితం చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.
ఈ సందర్బంగా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన ధర్మపురి శ్రీనివాస్ పార్టీ వీక్ అయిందని.. పార్టీలో నుంచి వెళ్లిపోలేదని, కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టారని వ్యాఖ్యానించారు. తాను హిందుత్వానికి కట్టుబడి ఉన్నానని, తనలో ఉన్న జాతీయ భావాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలవుతాయని నమ్ముతున్నానని అన్నారు.
తనకు రేవంత్ రెడ్డిలాగా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఒక పార్టీలో ఉన్న వారు మరొక పార్టీలోకి మారడం అన్నది మంచి పద్దతి కాదన్నారు. తాను పార్టీ మారాల్సి వస్తే, బీజేపీ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యానించారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి టీడీపీ నేతగా ఉన్నప్పుడు సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను, తన స్నేహితుడు, కాంగ్రెస్ పరమభక్తుడు, డీఎస్ ప్రియశిష్యుడు కాపర్తి శ్రావణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.