తెలంగాణ సినిమా హాళ్లలో ఇక ఫ్రీ ఎంట్రీ..!

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది మార్చి నుంచి సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడతల వారీగా అన్ లాక్ చేసినా.. థియేటర్లకు మోక్షం కలగలేదు. అక్కడక్కడ ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్ కు రావడం లేదు. దీంతో థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రేక్షకులను థియేటర్ కు రప్పించేందుకు వారికి ఉచితంగా సినిమా చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాలపాటు టికెట్ […]

Update: 2020-11-10 07:08 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది మార్చి నుంచి సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడతల వారీగా అన్ లాక్ చేసినా.. థియేటర్లకు మోక్షం కలగలేదు. అక్కడక్కడ ఓపెన్ అయినా ప్రేక్షకులు థియేటర్ కు రావడం లేదు. దీంతో థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించేందుకు వారికి ఉచితంగా సినిమా చూపించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాలపాటు టికెట్ లేకుండా ఉచితంగా ప్రదర్శించాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాలకు ఊరట కలుగుతుందని తెలుగు చిత్రసీమ భావిస్తోంది.

Tags:    

Similar News