బాలకృష్ణ ‘NBK 109’ సినిమాలో యంగ్ హీరోయిన్..స్పెషల్ లుక్‌ రిలీజ్ చేసి ఆసక్తిని పెంచిన మేకర్స్

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘NBK109’.

Update: 2024-09-29 15:17 GMT

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘NBK109’. దీనిని బాబీ తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలోంచి విడుదలైన పోస్టర్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా, ‘NBK109’ నుంచి మెస్మరైజింగ్ లుక్‌ను విడుదల చేశారు.

ఈ రోజు సెప్టెంబర్ 29న యంగ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఆమె పోస్టర్ ను రిలీజ్ చేసి ఆసక్తిని పెంచారు. రెడ్ కలర్ చీరలో స్లీవ్‌లెస్ జాకెట్‌లో ధగ ధగ మెరిసిపోతూ అందరినీ మంత్రముగ్దులను చేస్తుంది. అయితే ఏ పాత్రలో నటిస్తుందో మాత్రం మేకర్స్ వెల్లడించలేదు. దీంతో శ్రద్ధాశ్రీనాథ్ పోస్టర్ చూసిన వారు అయోమయంలో పడిపోయారు. ఆమె NBK109లో ఏ పాత్రలో నటించనుందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.


Similar News