ఆ స్టార్ హీరోయిన్‌తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి.. ఆమెతో ప్రేమలో ఉంటే ప్రాబ్లమేంటంటున్న టిల్లు?
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి సుపరిచితమే.
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గురించి సుపరిచితమే. రొమాంటిక్, కామెడీ టచ్ ఉన్న సినిమాలతో ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంటున్నాడు సిద్ధు. అక్క రాధికక్క అంటూ డీజే టిల్లు మూవీతో సిద్ధు కెరీరే ఓ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. త్వరలో ఈ యంగ్ హీరో టిల్లు స్వ్కేర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ మరింత రొమాంటిక్, ఫన్నీ సన్నివేశాలతో విడుదలవ్వనుందని.. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పోస్టర్లు చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. మునుపెన్నడు కనిపించని విధంగా బోల్డ్ గా దర్శనమివ్వనుంది.
తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి సిద్ధు ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరీ ఇందులో నిజమెంతని సిద్ధును ప్రశ్నించగా.. ‘‘స్టార్ హీరోతో లవ్ లో ఉంటే ప్రాబ్లమ్.. స్టార్ హీరోయిన్ తో ప్రేమలో ఉంటే సమస్య ఏముంది ఇక’’
అంటూ సిద్ధు నవ్వుతాడు. పెళ్లి పై ప్రశ్నించగా.. ఈ ఏడాదో, లేక వచ్చే సంవత్సరమో ఎప్పుడు చేసుకుంటానో నాకే క్లారిటీ లేదని చెబుతాడు. దీంతో నిజంగానే సిద్ధు ఆ హీరోయిన్ తో లవ్ లో ఉన్నట్లున్నాడని, ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆసక్తి చూపుతున్నాడని నెట్టింట నెటిజన్లు చర్చించుకుంటున్నారు.