లిటిల్ ప్రిన్సెస్ నీ రాకతో మెగా ఫ్యామిలీకి ఉత్సాహం తీసుకొచ్చావ్.. చిరంజీవి ట్వీట్
మెగా హీరో రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులయ్యారు. మెగా కోడలు ఉపాసన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో మంగళవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులయ్యారు. మెగా కోడలు ఉపాసన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో మంగళవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి మనవరాలిపై ఓ ట్వీట్ చేశారు. ‘‘నీ రాకతో మెగా ఫ్యామిలీకి ఉత్సాహం తీసుకొచ్చావు. నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీ మీ తల్లిదండ్రులను ఆశీర్వదించినట్లు అనిపిస్తుంది. తల్లిదండ్రులుగా రామ్ చరణ్, ఉపాసన, తాతగా నాకు సంతోషంగా గర్వంగానూ ఉంది’’ అంటూ చిరు రాసుకొచ్చారు. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ చిరు తాతయ్య అయ్యారని ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.
Also Read: మనువరాలిని చూసి మురిసిపోయిన చిరు.. అపోలో ఆసుపత్రి వద్ద మెగా జోష్
భగవంతుడితో దయతో మా ఆశ నెరవేరింది: చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Welcome Little Mega Princess !! ❤️❤️❤️You have spread cheer among the Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023