సరికొత్త కథతో వస్తున్న ‘పరారి’.. థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్, గాలి ప్రత్యూష సమర్పణలో జివివి గిరి నిర్మాణంలో సాయి శివాజీ తెరకెక్కించిన చిత్రం ‘పరారీ’.
దిశ, సినిమా: శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్, గాలి ప్రత్యూష సమర్పణలో జివివి గిరి నిర్మాణంలో సాయి శివాజీ తెరకెక్కించిన చిత్రం ‘పరారీ’. యోగేశ్వర్, అతిధి జంటగా వస్తున్న ఈ మూవీ మార్చి 30న రిలీజ్‌కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌లుగా వచ్చిన కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్, నటుడు సుమన్, ప్రసన్న కుమార్‌లు మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. అలాగే చంద్ర మహేష్, తుమ్మల పల్లి రామసత్య నారాయణ, ప్రతాని రామకృష్ణ గౌడ్‌లు థియేట్రికల్ ప్రోమోను, నటి కవిత సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి.హెచ్ హనుమంత రావు, గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్‌లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా కలిసి హీరో యోగేశ్వర్ బర్త్ డే సెలెబ్రేషన్ గ్రాండ్‌గా జరిపారు. అనంతరం మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ కావాలని కోరిన అతిధులు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.