‘శాకుంతలం’ కలెక్షన్లు రాకపోవడానికి ఆ సీన్‌లే కారణం.. రచయిత పరుచూరి షాకింగ్ కామెంట్స్

సమంత ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శాకుంతలం’.

Update: 2023-05-27 06:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: సమంత ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కాళిదాసు నటించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ కథ ఆధారంగా రూపొందింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాపై తాజాగా రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ..

‘‘శాకుంతలం’ నాకొక అద్భుతమైన జ్ఞాపకం. ఈ పాత్రలో సమంత చాలా అద్భుతంగా నటించారు. గుణశేఖర్ కథ రాసిన విధానం, తెరకెక్కించిన విధానం రెండు బాగున్నాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంతోనే ఈ కథ బాగా ప్రాచుర్యం పొందింది. విభిన్నమైన ఐడియాలజీ ఉన్న దర్శకుడు, రచయిత గుణశేఖర్ ప్రేక్షకులను ఆకర్షించేందుకు కథలో లేని కొన్ని సన్నివేశాలు పెట్టారు. ఫస్టాఫ్‌లో శకుంతల, దుష్యంతులు కలుస్తారా..? లేదా..? అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు. కానీ, సెకండాఫ్‌లో ఉంగరాన్ని చూసిన వెంటనే రాజుకుగతం గుర్తుకురావడంతో వాళ్లిద్దరూ కలిసిపోతారని చిన్నపిల్లాడికీ తెలిసిపోయేలా అనిపించింది. ఓవరల్‌గా సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ కారణంగా సినిమా కలెక్షన్‌పై ప్రభావం చూపించి ఉండొచ్చు’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News