మరో లెవల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో 'Avatar 2' ట్రైలర్

జేమ్స్‌ కేమరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అవతార్‌'. సుమారు 9 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మరో సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లు సాధించింది.. Latest Telugu News

Update: 2022-11-22 08:12 GMT

దిశ, సినిమా: జేమ్స్‌ కేమరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అవతార్‌'. సుమారు 9 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మరో సరికొత్త ప్రపంచానికి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లు సాధించింది. కాగా ఈ వండర్‌ మూవీ సీక్వెల్ 'అవతార్ 2' కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌లో దర్శకుడు జేమ్స్ కేమరూన్ ఎమోషనల్, యాక్షన్‌ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్సింగ్‌గా చూపించారు. ఇక రీసెంట్‌గా ఈ మూవీ‌ నుంచి రిలీజైన మరో ట్రైలర్‌.. మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా చేసింది. ఇందులో మరిన్ని కొత్త విజువల్స్‌ను చూపించడమే కాకుండా.. యాక్షన్ ఎలిమెంట్స్ మరో లెవెల్లో ఉన్నట్లుగా అభిమానులకు హింట్ ఇచ్చారు. మొత్తానికి ఈ మూవీ డిసెంబర్ 16న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More: కామంతో కవ్విస్తున్న నటి.. అందాలన్నీ ఆరుబయటే..


Similar News