Kamal Haasan: 'విక్రమ్‌'కు వచ్చిన డబ్బులు పంచిపెడతా: కమల్ హాసన్

Kamal Haasan says, He will repay all loans, as vikram movie earns 300 crore| గత మూడేళ్లుగా సినిమాలు చేయకుండా ఉన్న కమల్ హాసన్ చాలా రోజుల తరువాత 'విక్రమ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే

Update: 2022-06-15 11:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: Kamal Haasan says, He will repay all loans, as vikram movie earns 300 crore| గత మూడేళ్లుగా సినిమాలు చేయకుండా ఉన్న కమల్ హాసన్ చాలా రోజుల తరువాత 'విక్రమ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బ్లాక్‌ బస్టర్‌తో టాక్‌తో దూసుకెళ్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు ఈ సినిమాకు అన్ని బాషల్లో కలిపి రూ.300 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు సమచారం. తాజాగా.. ఈ సినిమా కలెక్షన్లపై కమల్ హాసన్ స్పందిస్తూ.. 'నేను ఇదివరకే చెప్పాను. రూ.300 కోట్లు సంపాదిస్తానని, అప్పుడు ఎవరూ నా మాట వినిపించుకోలేదు. కనీసం నన్ను అర్ధం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. ఈ సినిమాకు వచ్చిన డబ్బులతో నా అప్పులు తీర్చుకుంటా.. నచ్చిన పుడ్ తింటా.. అంతేకాకుండా తోటి సన్నిహితులకు సహాయం చేస్తా. మంచి మానవతావాదిగా ఉండాలని అనుకుంటున్నాను.' అని కమల్ హాసన్ అన్నారు.

Tags:    

Similar News