సక్సెస్ సందర్భంగా నిహారిక రెండో పెళ్లి ప్రకటించనుందా..? వరుడు ఎవరు, పెళ్లి ఎప్పుడంటే?
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ హీరోయిన్గా నటించినప్పటికీ మూవీస్‌లో పెద్దగా హిట్ అందుకోలేక పోయింది. కొంతకాలం యాంకర్‌గా వ్యవహరించింది. తర్వాత నాగబాబు.. చైతన్య జొన్నలగడ్డకు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. కానీ వీరి పెళ్లి మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. కారణమేంటో తెలియదు కానీ నిహారిక-చైతన్య విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం నిహారిక తన కాళ్ల మీద తను నిలబడాలని నిర్మాతగా మారింది. ‘కమిటీ కుర్రోళ్లు’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ మూవీ ఆగస్టు 9 వ తారీకున విడుదలై మంచి సక్సెస్ అందుకుంటోంది. మెగా ఫ్యామిలీ అండ్ మెగా అభిమానులచే నిహారిక ప్రశంసలు అందుకుంటుంది.
కథానాయికగా రాణించినప్పటికీ నిర్మాతగా మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుందని మెగా డాటర్ను ఆకాశానికెత్తుతున్నారు. ఇకపోతే ఈ సక్సెస్ సందర్భంగా మెగా డాటర్ పెళ్లి గురించి త్వరలోనే ప్రకటించనుందని నెట్టింట టాక్ నడుస్తోంది. కరెక్ట్ పర్సన్ దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని నిహారిక పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. కాగా మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ అబ్బాయిని వివాహమాడబోతుందంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఇరు కుంటుబీకుల మధ్య పెళ్లి గురించి చర్చలు అయిపోయాయని సమాచారం. కాగా ఈ సంవత్సరం చివర్లో మెగా ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతుందని టాక్.