‘ది కేరళ స్టోరీ’ ఎందుకింత హాట్ టాపిక్ అయింది? అసలు ఈ మూవీలో ఏముంది?

నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కడం ప్రతీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్‌గా మారిపోయింది.

Update: 2023-05-05 09:00 GMT


దిశ, వెబ్‌డెస్క్: నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కడం ప్రతీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్‌గా మారిపోయింది. గతేడాది బాలీవుడ్‌లో విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఆ ఇండస్ట్రీలో ఓ దుమారమే రేపింది. ఆ సినిమాని మర్చిపోకముందే తాజాగా మరో బాలీవుడ్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చ నడుస్తోంది. అసలు ఆ మూవీ ఏంటీ..? ఆ సినిమాలో ఏముందని అంత హాట్ టాపిక్‌గా మారిందో తెలుసుకుందాం..

ఇది స్టోరీ..

ఆ మూవీ మరేదో కాదు ‘ది కేరళ స్టోరీ’. లవ్ జీహాద్ ఇతివృత్తంతో దర్శకుడు సుదీప్తోసేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అదాశర్మ, సిద్ది ఇదాని, యోగితా తదితర తారలు ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ.. లవ్ జీహాద్ ద్వారా 33 వేల మంది హిందూ, క్రిష్టియన్ మహిళలను ముస్లిం మతంలోకి మర్చబడ్డారని, ఇందులో కొంత మంది ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితం అయ్యారని, ఐసిస్ పోరాటం ఉద్ధృతంగా ఉన్న సమయంలో కొందరు ఐసిస్ పోరాటానికి మద్దతుగా సిరియాకు తరలించారాలనే ఆరోపణలపై ‘ది కేరళ స్టోరి’ని నిర్మించారు.

వివాదానికి కారణమేంటి..?

అయితే ప్రజల మధ్య విభజనలు సృష్టించి, మత కలహాలను రెచ్చగొట్టనుందని సీపీఎం, కాంగ్రెస్ నేతలు వాదిస్తుండగా ఇప్పుడు ఆ మూవీకి మద్దతుగా బీజేపీ రంగంలోకి దిగింది. మరో వైపు ఈ మూవీకి వ్యతిరేకంగా కేరళలో నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. అలాగే ఇటు ఈ సినిమాను నిషేధించాలంటూ పిటిషన్‌ దాకలైంది. సినిమా ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రోత్సహిస్తోందని పేర్కొన్న పిటిషనర్.. తక్షణమే విచారణ జరపాలని కోరింది. అలాగే ‘ది కేరళ స్టోరీ’ సినిమా నిషేధించాలని దాఖలైన పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇక ఈ సినిమా సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసినందున తగిన ఫోరమ్‌ను తరలించాలని పిటిషనర్లను కోర్టు కోరింది.

తమిళనాడులో రెడ్ అలర్ట్

అయితే ఈ మూవీ ఈరోజు (మే 5)న విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో తమిళనాడు స్టేట్‌లో హై అలర్ట్ నెలకొంది. తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఇంటలీజన్స్ తీవ్ర హెచ్చరికలు చేసింది. సినిమా విడుదల పై స్టాలిన్ సర్కార్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై కేరళ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది కనుక ఇక ఈ నేపధ్యంలో తమిళనాడులో ఈ సినిమాను విడుదలచేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉందని ఇంటలీజెన్స్ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో ‘ది కేరళ స్టోరీ’ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకోవాలని ప్రభుత్వానికి సూచన చేసింది.

వివాదంపై దర్శకుడు ఏమంటున్నారంటే..

ఈ వివాదాల చెలరేగడంపై చిత్ర దర్శకుడు సుదీప్తోసేన్ స్పందించారు. ‘‘కేరళవాసులారా.. అక్షరాస్యతలో మీరు అగ్రస్థానంలో ఉన్నారు. విద్య మనకు సహనాన్ని నేర్పింది. ఇప్పుడే ఒక అభిప్రాయానికి ఎందుకు వస్తారు? ముందు సినిమాని చూడండి. అప్పుడు మీ అభిప్రాయం గురించి చర్చిద్దాం. ఈ సినిమాని మేము కేరళలో ఏడు సంవత్సరాలు షూటింగ్ జరిపాం. మీలో మేము ఒక భాగమే. మనం అందరం భారతీయులం’’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ డిపార్ట్ మెంట్ వాళ్లు 10 కట్స్ చెప్పినట్టు సమాచారం. ఈరోజు (మే 5న) ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోందోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.


హైటెన్షన్


Tags:    

Similar News