పోలీస్ కథతో వచ్చిన చిత్రాలు ఎందుకిలా విఫలమవుతున్నాయి?
అప్పట్లో హిట్ కొట్టాలంటే హీరో ఫ్యాక్షన్ లేదా ఖాకీ డ్రెస్ వేసుకోవాల్సిందే.
దిశ, సినిమా: అప్పట్లో హిట్ కొట్టాలంటే హీరో ఫ్యాక్షన్ లేదా ఖాకీ డ్రెస్ వేసుకోవాల్సిందే. అలా 90ల నాటి హీరోలు ఈ పోలీసు యూనిఫాంలో సినిమాలు తీసి భారీ హిట్ అందుకున్నారు. కానీ, ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రామ్ నటించిన ‘వారియర్’, సుధీర్‌బాబు ‘వేట’, నరేష్ ‘ఉగ్రం’, నాగచైతన్య ‘కస్టడీ’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచాయి. అయితే కథ బలంగా ఉంటే మంచి పోలీసులు, చెడ్డ పోలీసులు, జిత్తులమారి పోలీసులు, ఫన్నీ పోలీసులు.. ఇలా ఏ రకంగా ఉన్నా జనాలు వీక్షిస్తారు. ఉదాహరణకు రవితేజ ‘విక్రమార్కుడు’, తారక్ ‘టెంపర్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. అంటే కథలో కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే ఎలాంటి కాప్ స్టోరీ అయినా హిట్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.
Also Read...
లివ్ ఇన్ రిలేషన్ మాకు కొత్తదేమీ కాదు.. పవిత్రతో పెళ్లిపై స్పందించిన నరేష్