Journey Movie: శర్వానంద్ ‘జర్నీ’ రీరిలీజ్ ఎప్పుడంటే..?

శర్వానంద్ ‘జర్నీ’ రీరిలీజ్ ఎప్పుడంటే

Update: 2024-09-14 09:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేని మూవీ లిస్టులో జర్నీ కూడా ఒకటి. ఈ మూవీలో హీరో శర్వానంద్, అంజలి, జై, అనన్యలు ప్రధాన పాత్రలు పోషించారు. జర్నీ మూవీ తమిళంతోపాటు, తెలుగులోనూ సూపర్ హిట్ అందుకుంది. డైరెక్టర్ ఎం శరవణన్ డైరెక్షన్లో రూపొందించిన ‘ఎంగేయుమ్ ఎప్పోతుమ్’ మూవీని తెలుగులో జర్నీ పేరుతో విడుదల చేశారు. 13 ఏళ్ల క్రితం మన ముందుకొచ్చిన ఈ మూవీ రెండో సారి తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 21న ఈ మూవీని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

జర్నీ మూవీ మరోసారి రీరిలీజ్ అవుతుండడంతో .. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. హైదరాబాద్ లోనే కాకుండా చిన్న థియేటర్లలో నగరాల్లో, పట్టణాల్లో కూడా ఈ మూవీని విడుదల చేయనున్నారు. జర్నీ సినిమాని 4కే వెర్షన్ లో మన ముందుకు విడుదల చేయనుండడంతో శర్వానంద్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Read More....

Bommarillu: ఇట్స్ అఫీషియల్.. బ్లాక్ బస్టర్ సినిమా ‘బొమ్మరిల్లు’ రీరిలీజ్ 

Tags:    

Similar News