ప్రముఖ ఓటీటీ సంస్థలోకి ‘2018’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
చిన్న సినిమాగా వచ్చి ఇండస్ట్రీని ఊపేస్తున్న మలయాళ చిత్రం ‘2018’.
దిశ, వెబ్‌డెస్క్: చిన్న సినిమాగా వచ్చి ఇండస్ట్రీని ఊపేస్తున్న మలయాళ చిత్రం ‘2018’. టోవినో థామస్ నటించిన ఈ మూవీ 2018 లో కేరళలో వచ్చిన వరదల ఆధారంగా రియలిస్టిక్‌గా రూపొందించారు. ఈ మూవీ తెలుగులో 26 న విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 3 రోజుల్లెనే రూ.4.50 కోట్లను సాధించగా.. మలయాళం ఈ నెల 5న విడుదలైన రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 25 రోజుల్లోనే రూ. 160 కోట్లు వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కాగా.. థియేటర్లలో దుమ్ములేపుతున్న ఈ మూవీ ఓటీటీలో సత్తా చాటేందుకు వచ్చేస్తుంది. ‘2018’ మూవీ ఓటీటీ రైట్స్‌ను సోని లైవ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ పోస్ట్‌ను రిలీజ్ చేస్తూ.. జూన్-7 నుంచి ‘2018’ స్ట్రీమింగ్ కానునట్లు తెలిపారు.
ഒന്നിച്ച് കരകയറിയ ഒരു ദുരന്തത്തിൻ്റെ കഥ!
— Sony LIV (@SonyLIV) May 29, 2023
The biggest blockbuster Mollywood has ever seen is now coming to Sony LIV
2018, streaming on Sony LIV from June 7th#SonyLIV #2018OnSonyLIV #BiggestBlockbuster #BasedOnTrueStory
@ttovino #JudeAnthanyJoseph @Aparnabala2 #kavyafilmcompany pic.twitter.com/9UzcYSPz1j