Sitara-Mahesh Babu: గారాల పట్టి సితార బర్త్ ‌డే సందర్భంగా ప్రిన్స్ ఏం గిఫ్ట్ ఇచ్చాడని నెట్టింట చర్చ.. గెస్ చేయండి?

సూపర్ స్టార్ మహేష్ బాబు డాటర్ సితార నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది.

Update: 2024-07-20 13:37 GMT

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు డాటర్ సితార నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది. తన క్యూట్ క్యూట్ ఫొటోలు, వీడియోలతో జనాల్ని మెస్మరైజ్ చేస్తుంటుంది. ఈ ఏజ్‌లో కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో హీరోయిన్ లెవల్‌లో అనుచరులకు సంపాదించుకోవడం రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే సితార తొందర్లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు కూడా. ఇప్పటికే సూపర్ స్టార్‌తో కలిసి ఓ సినిమాలో మాస్ స్టెప్పులేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సితార ఓ రేంజ్‌లో డాన్స్ చేయడంతో బాబుని మించిపోయేలా ఉందంటూ అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. ఇదంతా పక్కన పెడితే..

నేడు సితార పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తండ్రి మహేష్ బాబు సోషల్ మీడియా వేదికన సితారకు స్పెషల్‌గా విష్ చేశారు. నమ్రత శిరోద్కర్ కూడా సితార చిన్నప్పటి ఫొటోలు అండ్ కొన్ని క్యూట్ మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో పంచుకుని గారాల పట్టి సితారాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే సితార బర్డ్ డే సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు ఏం బహుమతి ఇచ్చుంటారని నెట్టింట జనాలు చర్చించుకోవడం ప్రారంభించారు. నమ్రత - మహేష్ బాబు కలిసి కుమార్తెకు క్లాస్ట్లీ గిఫ్టే ఇచ్చినట్లు జనాలు భావిస్తున్నారు.రెండు, మూడు రోజుల్లో ఆ బహుమతి ఏంటో సితారే సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో చెప్పనుందని కామెంట్లు చేస్తున్నారు.


Similar News