OTT : ఓటీటీలోకి రాబోతున్న వెపన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. చాలా మంది థియేటర్లలో చూడలేని సినిమాలను ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వెపన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది.

Update: 2024-07-24 05:02 GMT

దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. చాలా మంది థియేటర్లలో చూడలేని సినిమాలను ఓటీటీలో చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వెపన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సత్యరాజ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన వెపన్ మూవీ జూలై 26న ఓటీటీలోకి రాబోతుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈమూవీని గుహన్ సెన్నియప్పన్ తెరకెక్కించారు. ఈ మూవీ జూన్ 7న థియేటర్లలో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయడానికి మూవీ టీం రెడీ అయ్యింది. జూలై 26 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే తెలుగులోకూడా రిలీజ్ చేయనున్నట్లు సమచారం.ఇక ఈ సినిమాలో సత్యరాజ్‌తో పాటు తాన్యా హూప్, వసంత్ రవి హీరో, హీరోయిన్స్‌గా నటించారు.

యాక్షన్, సైన్స్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ దర్శకడు సినిమాను తెరకెక్కించగా, ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ లేకపోవడం, కాన్సెప్ట్ కన్ఫ్యూస్‌గా ఉండటంతో సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Tags:    

Similar News