తన పెదవులు నా లిప్స్‌కు తాకగానే వాంతి వచ్చింది.. వందసార్లు నోరు కడుక్కున్నా : Raveena Tandon
బీటౌన్ స్టార్ యాక్ట్రెస్లో ఒకరైన రవీనా టాండన్ గురించి పరిచయం అక్కర్లేదు.
దిశ, సినిమా: బీటౌన్ స్టార్ యాక్ట్రెస్లో ఒకరైన రవీనా టాండన్ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగుతోపాటు పలు భాషల్లో నటించి హీరోయిన్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ‘ఆ రోజుల్లో కాంట్రాక్ట్ లాంటివి ఏమీ లేవు. అయినా కూడా నేను ఎప్పుడూ ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. ఆ సీన్స్ చేస్తే నాకు అసౌకర్యంగా ఉంటుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన ఓ సంఘటన ఇప్పటికి మర్చిపోలేను. ఓ సన్నివేశంలో నా సహనటుడి పెదవులు పొరపాటున నా పెదవులకు తగిలాయి. ఇది అతను కావాలని చేయలేదు అనుకోకుండా జరిగింది. వెంటనే అక్కడి నుంచి నా రూమ్‌లోకి వెళ్లాను. వికారంతో వామిట్ అయింది. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.