'ఊ అంటావా' పాటకు అల్లు అర్జున్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూశారా ?

Allu Arjun grooves to Pushpa song Oo Antava at SIIMA after-party - VIRAL VIDEO

Update: 2022-09-13 08:58 GMT

దిశ, సినిమా: డైరెక్టర్ సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా బాక్సాఫీస్‏ను షేక్ చేసిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక రీసెంట్‌గా సైమా అవార్డ్స్ 2022లోనూ సత్తా చాటిన సినిమా.. 12 విభాగాల్లో నామినేట్ అయి ఆరు కేటగిరీల్లో అవార్డు అందుకుంది. దీంతో పుష్ప చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బన్నీ ఫుల్ జోష్‍లో 'ఊ అంటావా మావ' పాటకు.. ప్రపంచాన్ని మరిచిపోయి మరీ చిల్ అవుతున్నాడు. డీజే పక్కనే నిల్చొని డ్యాన్స్ చేస్తూ 'ఎవరైనా ఊ అనాల్సిందే.. తగ్గేదే లేదు' అంటూ తనదైన స్టైల్‌లో డైలాగ్ చెబుతూ కనిపించాడు బన్నీ.

Also Read : మహేష్‌తో సినిమా కథ రివీల్ చేసిన జక్కన్న.. గ్లోబల్ లెవల్‌లో ప్లాన్ 

Tags:    

Similar News