నా ముఖంలో కాదు.. సమంత ముఖంలో నవ్వు చూడాలని ఉంది: విజయ్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’.
దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు మేకర్స్. ఇక మంగళవారం హైదరాబాద్‌లో మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహించగా.. విజయ్, సమంత తదితరులు ఈ వేడుకను అలరించారు. ఈ సందర్భంగా విజయ్ సమంత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘విజయ్ బ్రో నీ ముఖంలో నవ్వు చూడాలని శివ నెల నుంచి చెబుతున్నాడు. కానీ.. నవ్వు చూడాల్సింది నా ముఖంలో కాదు సమంత ముఖంలో. ఎందుకంటే తను ఈ సినిమా గురించి చాలా శ్రమించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ షూటింగ్ పూర్తి చేసింది’’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.