విజయకాంత్ కాంత్ రెండు సార్లు నా ప్రాణాలు కాపాడాడు : రజనీకాంత్
తమిళ సీనియర్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ తాజాగా అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే.
దిశ, సినిమా : తమిళ సీనియర్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్ తాజాగా అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే. దీంతో తమిళ పరిశ్రమ ఒక్క సారిగా కన్నీరు మున్నీరు అయ్యారు. సినీ, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విజయ్ కాంత్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ప్రజంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అప్‌కమింగ్ మూవీ ‘వెట్టయన్‘ షూటింగ్‌లో ఉన్నారు.
దీంతో మీడియా తో మాట్లాడుతూ .. విజయకాంత్ మరణం పట్ల సంతాపాన్ని తెలియజేశారు రజినీకాంత్.. ‘ విజయకాంత్ మరణ వార్త వినగానే చాలా బాధేసింది. ఒక మంచి ఫ్రెండ్ ని కోల్పోయాను. అతని గురించి రోజంతా మాట్లాడమన్నా నేను మాట్లాడతాను. ఎంతో కరుణ ఉన్న వ్యక్తి. ఆయనతో నాకు ఎప్పటికీ మర్చిపోలేని రెండు జ్ఞాపకాలు ఉన్నాయి. ఒకరోజు నేను అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరాను. విషయం తెలిసి మీడియా ఫ్యాన్స్ కుప్పలు తెప్పలుగా ఆసుపత్రికి చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అయింది. సరిగ్గా అదే సమయంలో విజయకాంత్ ఆస్పత్రికి చేరుకున్నారు. వచ్చీరాగానే 5 నిమిషాలో అందర్నీ కంట్రోల్ చేశాడు. తర్వాత ‘మా అన్నయ్య రజనీకాంత్ ను నేను చూసుకుంటాను.’ అన్నాడు. ఇంకో మర్చిపోలేని విషయం ఏంటంటే ఒక రోజు సింగపూర్/మలేషియా షో కోసం అందరూ బస్సు ఎక్కారు, నేను కూడా అదే బస్సు ఎక్కాలి. కానీ ఫ్యాన్స్ ఎక్కేటప్పుడు అడ్డుకున్నారు, బౌన్సర్లు వల్ల కూడా ప్రయోజనం లేకపోయింది. అదే సమయంలో ఆపద్బాంధవుడి లాగా విజయ్‌కాంత్ వచ్చి రెండు నిమిషాల్లో నన్ను కాపాడాడు. ఈ రెండు సంఘటనలు నా జీవితంలో మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు తలైవా.
.